There are thousand reasons to be unhappy, but a billion hearts will never let this country down.
Many term India’s progress over the past 60 years as decent. We have 10 times the number of doctors, our life ex-pectancy rose from 32 years to 65 years. We have broad-gauge rail links criss-crossing the whole country, 20 lakh kilo meters of new roads built; and we have increased our exports from a few million dollars at the time of Independence to more than $125 billion now.
We have to do a lot more, especially in many areas - An alarming figure of 350 million of people are still illiterate; 260 million do not get even two square meals a day; 150 million lack access to drinking water are just a few to quote.
There are many reasons to be unhappy but let us be proud of one reason. In the last 2 decades we were fortunate to witness a positive transforma-tion. Most of us are fortunate to be part of a generation making that posi-tive transformation. The challenge though is to continue it.
Tuesday, August 14, 2007
Thursday, August 2, 2007
ఎద తెంచుకు కురిసిన వాన
ఎటు చూసినా వాన
ఎల్లలు మరిచిన వాన
ఎడ తెగని వాన
ఎద తెంచుకు కురిసిన వాన
ఈరోజు చాల జోరు గా వాన పడింది. ఆ వాన చూసి బరువయిన మనసు పొంగినట్టు, చాల రోజులుగా కుట్టిన పెదవులు ఒక్క సారిగా మాటలు చెప్పనట్టు అనిపించింది. ఎందుకో ఈ రోజు వానకొక ప్రత్యేకత ఉంది.
మొదట నింగి అల్లరి చేసె చంటి పిల్లవాడిలాగ, మెరుపులతో ఉరుములతో అటూ ఇటూ విరుచుకు పడ్డాడు.
ఆ అల్లరికి ఆతని తల్లి నేల కి కోపం వచ్చింది.
ఆ పైన నేల తల్లి కొపంగా చూసిందేమో, కాసేపు స్తబ్ధత,
నింగి నల్ల ముఖం వేసాడు.
నేల తల్లి ఇంకా కోపంగా చూస్తూనే ఉన్నది
ఇంకాసేపు స్తబ్ధత.
బిక్క ముఖం వేసిన నింగి కళ్లల్లో మెల్లగా నీళ్లు తిరగతం మొదలయింది.
కన్నీరు ఒక్కో చుక్కా మొయిలు చెక్కిళ్లు దాటి కిందకు జారింది
పిల్ల వాడి కంట నీరు చూసిన నేల తల్లి కి కూడా మనసు కరిగింది.
ఒక్క సారిగా నింగిని అక్కున చేర్చుకుంది.
తల్లడిల్లన పసివాడిని హత్తుకుంది
నింగి తల్లి కౌగిట వెక్కి వెక్కి ఎడ్చాడు
ఆ కన్నీరు క్రిష్ణలయ్యింది, యమునలయింది

Wednesday, June 27, 2007
కాదేది కవితనర్హం
కాదేది కవితనర్హం
కలలు, కల్పనలు, కన్నీళ్లు,
కలగలిపి కలమున నింపి
కాసింత కాగితమున రాస్తే
...........................
వెన్నల నల్ల బోదు
జాబిలి చిన్న బోదు
నన్ను లొకం మరిచి పోదు
కాసేపు ఏమి రాయకుంటె
కలలు, కల్పనలు, కన్నీళ్లు,
కలగలిపి కలమున నింపి
కాసింత కాగితమున రాస్తే
...........................
వెన్నల నల్ల బోదు
జాబిలి చిన్న బోదు
నన్ను లొకం మరిచి పోదు
కాసేపు ఏమి రాయకుంటె
Sunday, June 3, 2007
Caffe Vanilla Frappuccino
| Caffe Vanilla Frappuccino |
![]() Smooth and sweet, you fit in to almost any crowd. No one would suspect you of being a coffee tweaker! |
బాలు పుట్టిన రోజు
Tommorow is SPB's 61st Birth day. The following lines dedicated to the musical journey called 'Balu'.
యదనిండుగా పాడు
ప్రతీ గొంతుక నాను
ప్రతీ గుండెను త్రాకు
సడి లేని రేయి సవ్వడి అతడు
ఆరగ సంగీతము నారగించి
చిగురు తాంబూలము సేవించి
మాంద్యం మెక్కి
పాడు కోకిలాతడు
తొలి ప్రేమికుడు అతడు
తొలి వియోగీ ఆతడే
చెవులు విచ్చి విను
గుండెల ఆర్తి ఆతడు
యదనిండుగా పాడు
ప్రతీ గొంతుక నాను
ప్రతీ గుండెను త్రాకు
సడి లేని రేయి సవ్వడి అతడు
ఆరగ సంగీతము నారగించి
చిగురు తాంబూలము సేవించి
మాంద్యం మెక్కి
పాడు కోకిలాతడు
తొలి ప్రేమికుడు అతడు
తొలి వియోగీ ఆతడే
చెవులు విచ్చి విను
గుండెల ఆర్తి ఆతడు
Friday, June 1, 2007
కరిగిన గగనం
నేను కన్నీరు పెట్టి చాల ఏళ్ళు కావస్తున్నది. ఈ మధ్య ఎవరన్నా ఎడుస్తుంటే వారు రోదిస్తున్నారన్న సానుభూతి కన్న, నా కన్నులలో నీరు సరే, కనీసం చమ్మ కూడ లేదని కలత చెందేవాడిని.
నేను చివరిసారిగా బహుశ: 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఏడ్చాను. మళ్ళీ ఏడుపు జాడ ఏప్పుడూ ఎరుగలేదు. సెంటిమెంటు ఘాటు గా ఉన్న సినెమాలు చూసినప్పుడు, కొన్నిసార్లు కళ్ళు చమర్చేవి. కాని ఆ చమ్మ ఎంతో సేపు ఉందేది కాదు.
ఆ రోజు నాకు ఇంకా బాగ జ్ఞ్యాపకం ఉంది। ఆ రోజు నా తండ్రి దివంగుతులయిన రోజు। వారు పోయరని తెలిసాక చాల సేపు దిక్కు తొచలేదు। ఏడవాలో లేక గంభీరం గా నోరు కుట్టేసుకొవాలో తెలియలేదు. నిజానికి ఆ రోజు కూడ చాల సేపటిదాక ఎడవలేదు. కష్ట కాలన దగ్గరయిన బంధువులలొ ఒకరు ఉన్నట్టుండి బోరు బోరు మంటూ ఎడవటం మొదలు పెట్టారు. వారు తాము ఎడ్చేది కాక నా దగ్గరకు వచ్చి "నాన్న ఇంక లేరు రా " అని గుచ్చి మరీ నన్ను ఎడిపించారు.
సరిగ్గ అప్పుడు మొదలయిన ఎడుపు ఘట్టం ఒక రోజు సాగి ఉంటుంది। నేను వెక్కి వెక్కి ఏడ్చాను. కుమిలి కుమిలి ఏడ్చాను. ఊరుకొమ్మంటూ ఎందరో ఓదార్చేరు. ఎంత మంది ఓదార్చినా ఆగని శోకం అది. కట్టలు తెంచుకున్న కన్నీరు అది, ఆరోజు క్రిష్ణలై, యమునలై పొంగింది.
గుండె జారిపొవటం అని విన్నాను కాని ఆరోజు నా గుండె నిజంగానే జారి పొయింది, కన్నీళ్ళుగా, నా కనుల నుండి జారి, నా చెక్కిళ్ళ కాసేపు ఆగి, పొడి బారిన పెదవుల తడుపుతూ నేల కు ఒరిగింది।
నేలపై అలా జారిన గుండె నాలోని తడిని తనతో పాటు నేలపాలు చెసింది। ఆ తది ఏమయిందొ నాకు తెలియలేదు. గుండెనయితే చిక్క పట్టుకున్నాను కాని ఆ తడి ని తిరిగి తీసుకోలేదు.
నేలపైన నీడ చెసిన ఆ తడి ఏమయి ఉంటుంది? ఇగిరిపొయి ఉంటుందా? నా తండ్రి దేహం పక్కన అప్పుడు వెలిగిన అగరు పొగలతొ పాటు ఎగిరి పొయి వుందివుంటుందా। ఆ తడి జాడ కోసం ఎన్నో మార్లు చూశాను. ఎక్కడైనా దొరుకుతుందెమొనని తడిమి తడిమి వెతుకున్నా, నా కళ్ళ తో నా కళ్ళలోకే చూసుకున్నా. ఏప్పుడయినా నింగి కురిస్తే, నా ఇగిరిపొయిన కన్నీరే అది అని అనుకున్నా.
[ఇంకా ఉంది...]
[సుధీర్ ధూర్జటి]

Subscribe to:
Posts (Atom)